ప్రజాశక్తి-కొయ్యూరు
మండలంలోని నల్లగొండ పంచాయతీ పరిధిలో రహదారి, సెల్ టవర్ నిర్మాణ పనులకు ఎంపిపి బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ మంగళవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా నల్లగొండ నుండి బోయవుట కొత్తవీధి వరకు రహదారి నిర్మిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సమస్యను నెల రోజుల్లో పరిష్కరించేందుకు కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు జల్లి బాబులు ఏఎంసీ డైరెక్టర్ కమలమ్మ, వైస్ సర్పంచ్ భవాని, వార్డు మెంబర్లు దేవి, లక్ష్మి, రాజేశ్వరి, టెక్నికల్ అసిస్టెంట్ రాజు, వీఆర్పీలు దేవుడు రాజు, గంగరాజు, సచివాలయ కన్వీనర్ నాగేంద్ర, గృహ సారధి నాగమణి, వైసీపీ నేతలు కోనేపు అచ్యుత్, ఎం.శివ, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.










