అన్నవరంలో సిసి కాల్వల నిర్మాణం పరిశీలి స్తున్న ఎంపిపి వాసురాజు
ప్రజాశక్తి -భీమునిపట్నం : మండలంలోని అమనాం. అన్నవరం గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎంపిపి దంతులూరి వెంకట శివ సూర్యనారాయణ రాజు (వాసు రాజు) శుక్రవారం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అమనాంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు ప్రక్రియను పరిశీలించారు. ఇదే పంచాయతీ గొల్లపేటలో 56 కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేశామని, నర్సయ్యపేట, జీరుపేట గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఎంపిపికి వివరించారు.. గడపగడపకు ప్రభుత్వంలో మంజూరైన రూ.20లక్షలతో అన్నవరం గ్రామంలో నాలుగు సిమెంట్ కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంపిపి వెంట ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ శివానంద కుమార్, డిఇఇ దుర్గాంబ, జెఇ పి.సుబ్బలక్ష్మి ఉన్నారు.










