ప్రజాశక్తి-ఆదోనిరూరల్
మండలంలోని అభివృద్ధి పనులకు ల్యాండ్ అలియనేషన్ కోసం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ భూములను పరిశీలించారు. శుక్రవారం మండలంలోని చిన్నపెండేకల్లో రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు చేపడుతున్న అభివృద్ధి పనులకు భూముల కేటాయింపునకు, ల్యాండ్ అలియనేషన్ కోసం సబ్ కలెక్టర్ ప్రభుత్వ భూములను పరిశీలించారు. డిప్యూటీ తహశీల్దార్ రజనీకాంత్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయరాం రెడ్డి, విఆర్ఒ తిరుమల్ రెడ్డి పాల్గొన్నారు.