ప్రజాశక్తి - కాకినాడ
జిల్లాలో చిన్నారులు, గర్భిణులకు సక్రమం పౌష్టికాహారం రక్తహీనత లోపాన్ని అధిగమించేందుకు దోహదపడుతుందని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు క్షేత్రస్థాయి సిబ్బంది కషి చేయాలని జిల్లా కలెక్టర్ కతికా శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. కతికా శుక్లా జాయింట్ కలెక్టరు ఎస్.ఇలక్కియ, ఇతర జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. సుస్థిర అభివద్ధి లక్ష్యాలు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కోవిడ్ పరీక్షలు, ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్, ఫీవర్ సర్వే, ఎన్సీడీ సర్వే వివరాలు, పారామెడికల్ సిబ్బంది, వైద్యుల నియామకం, మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి అంగన్వాడీ ఖాళీల భర్తీ, పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన డ్రాప్ అవుట్స్, జగనన్న విద్యా కానుక, మన బడి నాడు-నేడు, మౌళిక సదుపాయాల కల్పన, గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన, గడప గడపకు మన ప్రభుత్వం అర్జీల పరిష్కారం, ఇతర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టరు కతికా శుక్లా అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశమైన సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనకు అధికారులు ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. బరువు తక్కువ చిన్నారులు, కిశోర బాలికలు, గర్భిణీ స్త్రీలు రక్తహీనతకు గురికాకుండా సక్రమంగా పౌష్టికాహారం అందించాలన్నారు. సుస్థిర అభివద్ధి లక్ష్యాల సాధనకు వివిధ విభాగాల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలని జిల్లా కలెక్టరు కతికా శుక్లా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో కె.శ్రీధర్ రెడ్డి, సీపీవో పీ.త్రీనాథ్, డీఈవో కెఎన్వీఎస్.అన్నపూర్ణ, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, డీఎం అండ్ హెచ్వో డా. ఆర్.రమేష్, డీసీహెచ్‌ఎస్ డా. పీబీ విష్ణువర్థిని, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డా పీ.రాధాకష్ణా, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, వికాస పీడీ కె.లచ్చారావు, సోషల్ వెల్ఫేర్ జేడీ జే.రంగలక్ష్మీదేవి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, కాకినాడ, పెద్దాపురం డీఎల్డీవోలు తదితరులు హాజరయ్యారు.
అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా










