బోడవాడలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న ఆమంచి కృష్ణమోహన్
ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలం బోడవాడ గ్రామలోని ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు, ఇతర పలు అభివృద్ధి కార్యక్రమాలకు పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. ఆయన వెంట ముప్పాళ్ల రాఘవయ్య, కొరాకుల ఇస్సాకు, పర్చూరు సర్పంచ్ మళ్లా అంజమ్మ, శ్రీనివాసరావు, పర్చూరు మాజీ ఉప సర్పంచ్ గాదె సురేష్, శ్రీనివాసరావు, కంచ నపల్లి రమేష్, బోడవాడ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










