ప్రజాశక్తి-తిరువూరు : ఒక ప్రయివేటు కార్యక్రమానికి తిరువూరు వచ్చి తనపై లేనిపోని ఆరోపణ చేసిన విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) పై తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలి గడ్డ రక్షణనిధి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కారోనా బారినపడి ప్రజల్లో వందలాదిమంది చనిపోతే తిరువూరు రాని ఎంపి, నాలుగేళ్లలో ఎమ్మెల్యే ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ను కూడా నిర్మించలేదని, అభివద్ధి ఏమీలేదని చెప్పటం హాస్యాస్పదంగా రక్షణనిధి ఉందన్నా రు. 2019 ఎన్నికలు అనంతరం తాను, నూజీవీడు, మైలవరం ఎమ్మెల్యేలం కలిసి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేసి మూడవ జోన్ లో ఉన్న తిరువూరు, గంపలగూ డెం, ఏ.కొండూరు మండ లాలకు సాగు నీరు అందించాలని అధికారులతో సమావేశం నిర్వహించి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. తిరువూరు లోని తన కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం నిర్వహిం చారు. ఐదేళ్ల టిడిపి పాలన లో కూలిన వినగడప కట్లేరు బ్రిడ్జిని మీపార్లమెం టు నియోజకవర్గంలో ఇరిగేషన్ మంత్రి ఉండికూడ ఎందుకు నిర్మించలేదని ఎంపీని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మీ పాలనలో ఏ.కొండూరులో కిడ్నీ బారిన పడి మతి చెందిన వారి కుటుంబా లను ఆదుకోలేదు, ముందులు ఇవ్వలే దు, కృష్ణా జలాల సరఫరా చేయలేదు, డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించలేదు, డయాలసిస్ రోగులకు పెన్స్ న్ రూ.10 వేలు ఇవ్వలేదని ఎమ్మెల్యే ఆరోపిం చారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వా త తండాల్లో 50 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి కష్ణా జలాల అందిస్తు న్నామని, తిరువూరులో రూ. 50 కోట్లతో డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించి రోగులకు చికిత్స చేస్తున్నామని, త్వర లో ఏ.కొండూరు లో కూడా డయాలసి స్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. నిత్యం 360 రోజులు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజాల్లో ఉండే తనను నాలుగేళ్ళ తరువాత తిరువూరు వచ్చి విమర్శించే అర్హత ఎంపికి లేదని ఎమ్మెల్యే అన్నారు. ఎం పికి తమ్ముడు చిన్ని భయం పట్టుకుం దని, అందుకే నోటి ఏదోస్తే ఆది మాట్లా డుతున్నారని, ముందు ఇల్లు చక్క బట్టుకోవాలని నానికి ఎమ్మెల్యే హితు వుపలికారు. ఈకార్యక్ర మంలో ఎఎంసి చైర్మన్ శీలం నాగనర్సి రెడ్డి, జడ్పిటిసి యరమల రామచంద్రా రెడ్డి, కౌన్సిలర్లు పరసా శ్రీనివాసరావు, తంగిరాల వెంకటరెడ్డి, పసుపులేటి శేఖర్ బాబు, కో ఆప్షన్ సభ్యులు ఏరు వ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొ న్నారు.










