
ప్రజాశక్తి-దర్శి: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, జగనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. గురువారం దర్శి సచివాలయం-1, బొట్లపాలెంలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం నిర్వహించారు. పట్టణ జేసీఎస్ కన్వీనర్ వెన్నపూస కోటిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ జగన్ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టారన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ నేరుగా బటన్ నొక్కి పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో దర్శి కమీషనర్ వై మహేష్, ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి, రాష్ట్ర కార్పొరేషన్ డైరక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కౌన్సిలర్లు వీసీ రెడ్డి, మోహన్‌రెడ్డి, నాయకులు హరీష్, యర్రయ్య, వాసుదేవరెడ్డి, మిల్లర్ బుజ్జి, అచ్చయ్య, దేవప్రసాద్, శాగం పాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
టంగుటూరు: గడచిన నాలుగున్నరేళ్లలో ప్రజలకు అందిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలు ఆలోచన చేయాలని వైసిపి జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు చింతపల్లి హరిబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక 1వ సచివాలయంలో 'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం వైసీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికోటి అశోక్‌బాబు ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టంగుటూరు ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ చేతుల మీదుగా అభివృద్ధి పట్టికను ఆవిష్కరించారు. టంగుటూరు ఎంపీడీఓ పి రత్నజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దిరాల మమత, మండల వైసీపీ అధ్యక్షులు మల్లవరపు రాఘవరెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ చింతపల్లి హరిబాబు, రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పుట్టా వెంకట్రావు, ఎంపీటీసీలు కొమ్ము ప్రభుదాసు, బొడ్డు వాసంతి - రవీంద్ర, వైసిపి సోషల్ మీడియా కన్వీనర్ కొమ్ము అనిల్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.