Sep 12,2023 21:07

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సిఎం ముఖ్య కార్యనిర్వాహకులు సమీర్‌శర్మ

కడప : రాష్ట్ర ప్రభుత్వ ఆశయం మేరకు అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూ సుస్థిర అభివద్ధి లక్ష్య సాధన దిశగా జిల్లా అడుగులేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య కార్యనిర్వహకులు డాక్టర్‌ సమీర్‌ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ స్పందన హాలులో జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజుతో కలిసి జిల్లాలో ఆరోగ్యం, విద్య, మహిళా శిశు అభివద్ధి తీరుపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెసిగణేష్‌ కుమార్‌, కడప నగర కమీషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సమీర్‌ శర్మ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జిల్లాలో అభివద్ధి అన్ని విధాలా సంతప్తికరంగా సాగుతోందని ా్ల కలెక్టర్‌ విజరు రామరాజు, జిల్లా అధికారులను అభినందించారు. జిల్లా అభివద్ధి లక్ష్య సాధనల అధికారులు కీలక పాత్ర పోషించాలన్నారు. విద్య, వైద్యం, పోషకాహారం, మహిళా శిశు అభివద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించిందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గహాల్లో.. రక్త హీనత ఉన్న 10-19 ఏళ్ల బాలికలను గుర్తించి వారికి ఐరన్‌ టాబ్లెట్స్‌ పంపిణీ చేయాలన్నారు. రక్త హీనత ఉన్న 15-49 ఏళ్ల గర్భిణులను పిహెచ్‌సిలు, అంగన్వాడీల్లో పౌష్టిహాకారం అం దించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అధికారులు, సిబ్బంది సమన్వయంతో వైఎస్‌ఆర్‌ జిల్లా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌, ఆర్‌డిఒ ధర్మ చంద్రారెడ్డి, డిపఒ, జడ్‌పి సిఇఒలు ప్రభాకర్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ, విద్యా, ఐసిడిఎస్‌ శాఖల అధికారులు నాగరాజు, హిమదేవి, రాఘవరెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.