Jul 30,2023 22:50

పోస్టర్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

- ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌
ప్రజాశక్తి- కంచిలి: 
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేక, అధికార పార్టీ నాయకులు ప్రజల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. మండలంలోని డోళగోవిందపురం పంచాయతీలో ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో గురించి వివరించారు. అనంతరం రేఖాదేవిపురలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. రోడ్లు, సామాజిక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు టిడిపి హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఏ పనులకు, ఏ నిధులు మంజూరు జరిగిందో వాటి వివరాలు తెలియని కొంతమంది నాయకులు అవగాహన లోపంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు మాదిన రామారావు, పిలక చినబాబు, ఎం.ఎం.పట్నాయక్‌, బొడ్డ అప్పారావు, పురుషోత్తంరెడ్డి, టి.వి.రమణ, రమేష్‌రెడ్డి, పూర్ణ పాల్గొన్నారు.