అభివృద్ధి చేసినందుకే ఆదరిస్తున్నారు
: ఎమ్మెల్యే గంగుల
ప్రజాశక్తి - చాగలమర్రి
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేసిందుకే ప్రజలు ఆదరిస్తున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మద్దూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు. జలకళ కింద బోర్లు వేయాలని ఎమ్మెల్యేను రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, సింగిల్చిండో అధ్యక్షులు దస్తగిరి, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు, ఎంపిటిసిలు బేబమ్మ, లక్ష్మిరెడ్డి, నాయకులు జమాల్ వలి, ఓబులేసు, సాల్మాన్, రమణారెడ్డి, బాబు, ఏసు, ఓబులేసు,ప్రభుకాంత్,అబ్దుల్ కలాం,శ్రీనివాసులు,ఎంపీడీఓ భాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.










