
భూమిపూజ చేసి పనులను ప్రారంభిస్తున్న ఇన్‌ఛార్జి దీపిక, ఛైర్‌పర్సన్ ఇంద్రజ
హిందూపురం : హిందూపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వైసిపి సమన్వయ కర్త, ఇన్‌ఛార్జి దీపిక పేర్కొన్నారు. పురపాలక సంఘంలోని 31వ వార్డులో నూతనంగా చేపట్టిన సిసి మురుగు కాలువ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా గడపగడపకూ మన ప్రభుత్వం కింద వస్తున్న నిధులతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులను తీసుకొచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చిన్నమ్మ, షాజియా, వైసిపి నాయకులు నాగరాజు, సిపిసి సాధిక్ పాల్గోన్నారు.