Aug 15,2023 22:18

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

ప్రజాశక్తి ఓబుల దేవర చెరువు : 2024 లో జరిగే ఎన్నికల్లో తాను విజయం సాధించి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా అనిమాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుట్టపర్తి జిల్లా కేంద్రం కావడానికి శ్రీ సత్య సాయి బాబా. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్ట్‌ రత్నాకర్‌ చలవే అని అన్నారు. తానే జిల్లాను తీసుకువచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో మౌలిక వసతులు ఎందుకు కల్పించలేక పోయారని ప్రశ్నించారు. తాను ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నానని ఓడినా గెలిచినా తనకు ప్రజల క్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. అంతేగాని ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి మాదిరి గొప్పలు చెప్పుకోవడం తనకు అలవాటు లేదని చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడికెళ్లిన గతంలో తాను చేసిన అభివృద్ధే కన్పిస్తోందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసింది ఏమీ కనబడలేదన్నారు. తనపై తప్పుడు కేసులు బనాయించారనిఈ కేసులకు తాను భయపడనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్‌, కన్వీనర్‌ జయచంద్ర, నిజాం, డాక్టర్‌ జాకీర్‌ అహ్మద్‌, అంజినప్ప, షబ్బీర్‌, చాంద్‌ బాషా, షఫీ, మా భాష ,ఇర్షాద్‌, బడిశం రామాంజి తదితరులు పాల్గొన్నారు.