Oct 07,2023 00:17

అభివృద్ధే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం

అభివృద్ధే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం
- డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ప్రజాశక్తి కార్వేటినగరం : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీరాజు పేట పంచాయతీ వెంకటాద్రిపురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అభివద్దే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలు ఎదుగుదలకు కషి చేశారని పేర్కొన్నారు. రాష్ట్రాల కన్నా రాష్ట్రం అభివద్ధిలో ముందంజలో ఉందని తెలిపారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి పైన నుంచి వెళ్లే విద్యుత్‌ లైన్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. జగనన్న ధైర్యంగా కొలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంటి పట్టాలు లేని వారికి ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇల్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు. కార్డుదారులకు చౌక దుకాణం ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మా గ్రామంలో సిమెంటు రోడ్డు చేపట్టామన్నారు. చిన్నారులు చక్కగా చదివించాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్‌ రెడ్డి నాడు నేడు కింద పాఠశాలను బలోపేతం చేశారని గుర్తు చేశారు. మంత్రి వెంట ఆయన కుమార్తె కపా లక్ష్మి, ఎంపీపీ లతబాలాజీ, మండల కన్వీనర్‌ శేఖర్‌ రాజు,మండల మాజీ కన్వీనర్‌ ధనంజయ వర్మ, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కష్ణ యాదవ్‌, నాయకులు వెంకటరత్నం పాల్గొన్నారు.