
జగ్గయ్యపేట : భారతదేశంలో మంచి ఆశయాల కోసం అభివద్దే ధ్యేయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పిడక రాజన్న దొర అన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో నూతన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల భవనం, డైనింగ్ హాల్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పిడక రాజన్న దొర మంగళవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజన్న దొర మాట్లాడుతూ గిరిజన హాస్టల్‌లో అదనపు గదులు, డైనింగ్ హాల్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఎస్సీ, ఎస్టీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేశారన్నారు. 2014-19 సంవత్సరాల మధ్య టిడిపి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివద్ధికి 12 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభానుకు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో వారిని గెలిపించాలన్నారు. ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగ్గయ్యపేట నియోజకవర్గం అభివద్ధి, సంక్షేమానికి కృషి చేశానన్నారు. నియోజకవర్గంలో ఎస్టీలు 15 వేల మంది ఉన్నారని, వీరిలో 10 వేల మంది సుగాలీలు, 5 వేల మంది ఎరుకల, యానాది, బుడబుక్కల వారు ఉన్నారన్నారు. 14 కోట్ల రూపాయలతో చిల్లకల్లు, జగ్గయ్యపేట నాలుగు రోడ్ల లైను నిర్మాణం, 15 కోట్ల రూపాయలతో పెనుగంచిప్రోలు దేవాలయం అభివద్ధి పనులు, కోటి రూపాయలతో ఆర్టీసీ హైవే బస్టాండ్ నిర్మించడం చేయటం జరుగుతుందని, రానున్న కాలంలో జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి రాజన్న దొరను జగ్గయ్యపేట నియోజకవర్గానికి రూ.2 కోట్లు నిధులు ధర్మవరప్పాడు తండా, భూదవాడ, రెడ్యా నాయక్ తండా, వత్సవాయి మండలంలోని గోపినేనిపాలెం, కన్నవీడు, మాచినేనిపాలెం గ్రామాల్లోని స్మశాన వాటికలు, డ్రైనేజ్, కమ్యూనిటీ హాళ్లు కొరకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, యువ నాయకులు సామినేని వెంకట కష్ణ ప్రసాద్ బాబు, మాజీ కెడిసిసి చైర్మన్ తన్నీరు నాగేశ్వరావు, మున్సిపల్ వైస్ చైర్మన్‌లు ఆఫీసున్నీసా, తుమ్మల ప్రభాకర్, వైఎస్‌ఆర్సిపి నాయకులు వేల్పుల రవికుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మానేపల్లి బ్రహ్మం, వత్సవాయి జెడ్పిటిసి సభ్యురాలు దయామని, ఎంపీపీ రమాదేవి, పెనుగంచిప్రోలు జడ్పిటిసి ఉట్ల నాగమణి, పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపూడి గాంధీ, శ్రీనివాస్ గౌడ్, భాస్కరరావు, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.