ప్రజాశక్తి - పూసపాటిరేగ : అభివృద్దే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. బుధవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ముందుగా సుమారు రూ.40లక్షలతో నిర్మించిన పూసపాటి రేగ -2 సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సిహెచ్ అగ్రహారంలో నూతనంగా సుమారు రూ.18 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్‌ను, చౌడవాడ రూ .18 లక్షలతో నిర్మించి వెల్నెస్ సెంటర్‌ను, రూ .16 లక్షలతో నిర్మించిన బల్క్ మిల్క్ సెంటర్‌ను ప్రారంభించారు. గోవిందపురంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ .22 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.58 లక్షలతో నిర్మించిన భరణికం రోడ్డును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో కోట్లాది రూపాయలతో సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలను నిర్మించిన ఘనత ఈ ప్రభుత్వాని దేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మహంతి కళ్యాణి, వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, జెసిఎస్ కన్వీనర్ మహంతి శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి అల్లాడి రమేష్, నాయకులు మహంతి జనార్దన్ రావు, పిఎసిఎస్ చైర్మన్ మహంతి లక్ష్మణరావు, సర్పంచులు టి సీతారాం, బాలా రామలక్ష్మి, బాల అప్పలరాజు, పట్టింపు శ్రీనివాసరావు, పట్టింపు శివ, రాజ్యలక్ష్మి, మోంగం నాగబాబు, కొయ్య ఎల్లన్న రెడ్డి పాల్గొన్నారు.










