Sep 16,2023 21:03

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌

చాపాడు : సిఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి సంక్షేమం, అభివద్ధి రెండు కళ్లు లాంటివని రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మైదుకూరులో శనివారం రూ.2.50 కోట్లతో నిర్మించిన మున్సిపాలిటీ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలకు నిరం తరం సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. పథకాలు అందని వారికి జగనన్న సురక్ష పేరుతో అవసరమైన సర్టిఫికెట్లను మంజూరు అయ్యేలా చేశారని పేర్కొన్నారు. రైతులకు మహిళలకు అనేక కార్యక్రమాలతో లబ్ధి చేకూరేలా చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు తప్పు చేసిన చట్ట ప్రకారం జైలుకు వెళ్లిన టిడిపి వారు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం టిడిపిలో నాయకత్వ సమస్యలు ఏర్పడ్డా యన్నారు. నాయకత్వం కోసం బాలకృష్ణ, లోకేష్‌ మధ్య అంతర్యుద్ధం జరు గుతోందని పేర్కొన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ అభివద్ధికి రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి మాట్లాడుతూ టిడిపి హయాంలో మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. వైసిపి పాలనలో రూ.67 కోట్లతో సీసీ రోడ్లు, బిటి రోడ్లు, డ్రెయినేజీ కాలువలు, తదితర అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కడప నగర మేయర్‌ సురేష్‌ బాబు, వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారుడు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్ర, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీమన్నారాయణరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ రంగస్వామి, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.