Jul 14,2023 21:28

విసిలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజరురామరాజు

కడప : ప్రాధాన్యత రంగాలకు సంబంధించి అన్ని అభివద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు సంబ ంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి స్థిరమైన అభివద్ధి లక్ష్యాలు, వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రోడక్ట్‌ అవార్డు, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎస్‌టిజి ఇండికేటర్స్‌, విద్య, జగనున్నకు చెబుదాం తదితర అంశాలపె. అన్ని జిల్లాల కలెక్టర్‌ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విస్తతంగా సమీక్ష నిర్వహించారు. సమావేశానికి కడప కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలు నుంచి కలెక్టర్‌తో పాటు జెసి గణేష్‌ కుమార్‌ హాజరయ్యారు. విసి ముగిసిన అనంతరం సంబ ంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాను అన్ని అంశాలలో ముందంజలో నిలిపేలా అధికారులు కషి చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే తన దష్టికి తీసుకువస్తే క్షేత్రస్థా యిలో వాటి పరిష్కారానికి కషి చేస్తామన్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించేలా పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యతనిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ, వైయస్సార్‌ క్లినిక్‌ లు, తదితర ప్రభుత్వ శాశ్వత భవన నిర్మాణాలపై దష్టిని సారించి వెంటనే పనులు పూర్తి చేసి ఆయా శాఖలకు అప్పగి ంచాలని పంచాయతీరాజ్‌ అధి కారులను ఆదేశించారు. నాడు- నేడులో భాగంగా జరుగుతున్న పనులను నిర్దేశిత లక్ష్యంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయమై మండల స్పెషల్‌ ఆఫీసర్‌, ఎంపీడీవో, ఇంజినీరింగ్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు సమావేశం నిర్వ హించి సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు వేగవంతంగా జరిగేలా చూడాల న్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సక్రమంగా పనిచేయకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖ, ఐసిడిఎస్‌, మున్సిపల్‌, మైనర్‌ ఇరిగేషన్‌, ఎపిఇ డబ్ల్యూఐడిసి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.