కడప : జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల అభివద్ధి పనులను వేగవంతం చేస్తూ రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ బోర్డ్ రూమ్ హాలులో ఎన్నికల సన్నద్ధత, క్యాస్ట్ సర్వే, అడుదాం ఆంధ్రా క్రీడల నిర్వహణ, ఎపి వై నీడ్స్ జగన్, నాడు-నేడు అభివద్ధి పనులు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిశీలన, గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో ప్రోగ్రెస్, జగనన్నకు చెబుదాం ఇకెవైసి పెండింగ్ పై జెసి గణేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూష, డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్‌లతో కలిసి మండల అధికారులతో కలెక్టర్ విసి ద్వారా సమీక్ష చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ఇంజనీరింగ్ టీమ్‌ను ఎంపిక చేయాలన్నారు. తహశీల్దార్లందరూ పోలింగ్ స్టేషన్ల వద్ద సదుపాయాలను కల్పించాలన్నారు. డిఆర్‌ఒ ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్ల బడ్జెట్ నిర్వహణ ఉంటుందన్నారు. తాత్కాలిక స్ట్రాంగ్ రూములను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని రకాల ఫారమ్స్ వివరాలను బుధవారం నాటికి పూర్తి చేయాలన్నారు. జంక్ క్యారెక్టర్స్, అద్దె ఇంట్లో నివాసాలున్నవారు, వలసలో ఉన్నవారి వివరాలను మరోమారు పరిశీలించాలన్నారు. 16 నుంచి క్యాస్ట్ బేస్డ్ సర్వేని సక్రమంగా నిర్వహిం చాలన్నారు. 20 నుంచి 'అడుదాం ఆంధ్రా' రిజిస్ట్రేషన్ ప్రారంభించి, డిసెంబర్ 15 నుంచి పోటీలను నిర్వహించాలన్నారు. 'వై నీడ్స్ జగన్' కార్యక్రమం నిర్వహణలో భాగంగా అభివద్ధి సంకేమ పథకాల ద్వారా మండల వారీగా మొత్తం ఇప్పటివరకు ఏయే పథకాల ద్వారా ఎంత మంది లబ్ది పొందారన్న వివరాలను తెలుపుతూ ప్రదర్శించే బోర్డులను సచివాలయాల వారీగా ఎక్కడా పెండింగ్ లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న హౌసింగ్ లే అవుట్లలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను నిర్ధేశిత గడువు లోపు త్వరితగతిన పూర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల నుంచి కడప, బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు ఆర్‌డిఒలు మధుసూధన్, వెంకట రమణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు పాల్గొనగా, స్థానిక బోర్డ్ మీటింగ్ హాలు నుంచి జడ్‌పి సిఇఒ సుధాకర్‌రెడ్డి, డిపఒ ప్రభాకర్ రెడ్డి, సిపిఒ వెంకటరావు, డ్వామా పీడీ యధుభూషణ్ రెడ్డి, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద్ నాయక్, హౌసింగ్ పీడీ కష్ణయ్య, పిఆర్‌ఎఇ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పివో ప్రభాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులైన నియోజకవర్గ, మండల ప్రత్యేకధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.విసి ద్వారా మండలస్థాయి అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్