
రాయచోటి : కలెక్టర్, జెసి, డిఆర్‌ఒ బంగ్లా కోసం స్థల చదును, భూమి అభివద్ధి పనులను వేగ వంతం చేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికా రులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వెనక వైపు కలెక్టర్, జెసి, డిఆర్‌ఒ బంగ్లాల నిర్మాణం నిమిత్తం చదును చేస్తున్న పనులను రెవెన్యూ, ఆర్‌అండ్‌బి అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీ లించారు. ఈ సందర్బంగా కలెక్టర్, జెసి, డిఆర్‌ఒ బంగ్లాలను ఏ ప్రదేశంలో ఎంత విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టారు, మెయిన్ రోడ్డుకు, కలెక్టరేట్‌కు అనుసంధానిస్తూ రహదారి ఏర్పాటు తదితరాలను మ్యాపుల ద్వారా కలెక్టరు పరిశీలించారు. అక్కడ ప్రకతి పరంగా ఏర్పడిన గుండ్లను భవనాల నిర్మా ణాలకు తొలగించరాదని చెప్పారు. గుంతలు ఏర్పడిన ప్రాం తాన్ని మట్టితో నింపి చదునుచేయాలని పేర్కొన్నారు. అలాగే ఆ ప్రదేశంలో ఉన్న పెద్ద చెట్లను నరికి వేయకుండా పిచ్చి మొక్క లను తొలగించాలన్నారు. ఆ ప్రాంతంలో ఇతరులు ఎవరూ మట్టి తవ్వి తీసుకొని వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా అక్రమంగా మట్టి తరలిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని సదరు బంగ్లా నిర్మాణాలు చేపట్టిన ప్రభుత్వ స్థలం చుట్టూ వెంటనే ఫెన్సింగ్ వేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఆర్కిటెక్చర్‌ను పిలిపించి సదరు స్థలాన్ని స్వయంగా పరిశీలించి బంగ్లాల నిర్మాణం మ్యాపులు రూపొందించాలని ఆర్ అండ్‌బి అధికారులను ఆదేశించారు. భూమి అభివద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొ న్నారు. అనంతరం వివిధ అంశాలలో పలు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి తహశీల్దార్ ప్రేమంత కుమార్, ఉమ్మడి జిల్లా ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ మహేశ్వర్‌రెడ్డి, డిఇ చంద్రశేఖర్‌రెడ్డి, సర్వేయర్లు పాల్గొన్నారు.
ఇవిఎంల స్కానింగ్ ప్రక్రియను పూర్తిచేయాలి
జిల్లాకు ఇటీవల నూతనంగా వచ్చి స్థానిక గోడౌన్లలో భద్రపరిచిన ఇవిఎంలన్నింటిని శుక్రవారం సాయం త్రంలోగా స్కానింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న ఇవిఎంల గోడౌన్‌లో ఇవిఎంల స్కానింగ్ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లాకు ఎన్ని ఇవిఎంలు వచ్చాయి, ఎన్నింటిని స్కాన్ చేశారు, ఇంకా చేయాల్సినవి ఎన్ని అని అధికారులను కలెక్టర్ ప్రశ్నించగా ఇవిఎంలకు సంబంధించి వివి ప్యాట్‌లు 4850, బియూలు 4440, సియూలు 3950 వచ్చినట్లు రెవిన్యూ సిబ్బంది కలెక్టరుకు వివరించారు. ఇందులో ఇప్పటివరకు 1330 వివి ప్యాట్‌లు, 2048 బియూలు, 3503 సియూ యూనిట్లను స్కా నింగ్ చేశారని చెప్పారు. స్కానింగ్ చేసిన వెంటనే ఎలక్షన్ కమి షన్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారని తెలిపారు. ఎలాంటి తప్పు లకు తావివ్వకుండా జాగ్రత్తగా పని పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం గోడౌన్‌లో ఉన్న వివి ప్యాట్, బియు, సియు యూ నిట్లను, వాటి స్కానింగ్ విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలిం చారు. గోడౌన్ భద్రత అంశాలను కూడా అధికారులతో కలెక్టర్ చర్చించి పలు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్‌డిఒ రంగస్వామి, తహశీల్దార్ ప్రేమంత కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.