అభివద్ధే లక్ష్యంగా జగన్‌మోహన్ రెడ్డి పాలన
- డిప్యూటీ సిఎం నారాయణ స్వామి
ప్రజాశక్తి - కార్వేటినగరం : అభివద్ధే లక్ష్యంగా జగన్‌మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని డిప్యూటీ సిఎం నారాయణ స్వామి అన్నారు. గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం ఉదయం అల్లాగుంట, అన్నూరు, ఇందిరరమ్మ ఇళ్ళు, చౌటూరు, కష్ణ సముద్రం దళితవాడ, అన్నూరు, సెట్టిగుంట ఏనాది కాలనీ ఉప్పరపల్లి గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించరు. ఈ సందర్భంగా సర్పంచ్ సుందర్ రాజ్ ఆధ్వర్యంలో అల్లాగుంటలో మంత్రి నారాయణస్వామి పై పూల వర్షం కురిపించారు. అల్లగుంటలో జాతీయ రహదారి నుండి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే మాంత్రి స్పందిస్తూ సిసి రోడ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కష్ణ సముద్రంలో 78 మందికి ఇంటి పట్టాలు మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టలు పంపిణీ చేశారు. గత 30 సంవత్సరాలు ఇంటి పట్టాల కోసం పోరాడుతూ ఉంటే డిప్యూటీ సీఎం నారాయణస్వామి చొరవతో పట్టాలు మందులు కావడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ సుందర్ రాజ్, వైసిపి నాయకులు ఏకాంబరం,హమీద్ పేర్కొన్నారు. నేటికీ కల నెరవేరిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అల్లగుంట లో సర్పంచ్ సుందర్ రాజ్ ఆధ్వర్యంలో క్రెన్ తో గజమాల వేసి స్వాగతం పలికారు. అదేవిధంగా కష్టసముద్రంలో ఏకం వరం కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో గజమాలవేసి ఘనంగా సన్మానించారు.
సచివాలయం.. రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
అన్నూరు గ్రామంలో 40 లక్షలతో నూతన సచివాలయం, 21 లక్షలతో రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి నారాయణస్వామి, మాజీ సర్పంచ్ లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అధికారులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతబాలాజీ, మండల కన్వీనర్ శేఖర్ రాజు, సింగిల్ విండో అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్ ధనంజయవర్మ, మండల కో ఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్ రెడ్డి, తుడా మాజీ ప్లానింగ్ అధికారి కష్ణారెడ్డి, జె సి ఎస్ కన్వీనర్ పురంధర్, వైసిపి నాయకులు ఢిల్లీ, లోకనాథ నాయుడు,హమీద్,శేఖర్, గోపి,రాంబాబు రెడ్డి,వరదరాజులు రెడ్డి, శేఖర్ యాదవ్, ధనశేఖర్ వర్మ, హేమలత, ఎంపీడీవో మోహన్ మురళి, తహసీల్దార్ రవికుమార్,మండలశాఖ నాయకులు పాల్గొన్నారు.










