Oct 08,2023 21:28

మూర్తి దంపతులను సన్మానిస్తున్న సాహితీవేత్తలు

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : పట్టణానికి చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, పంచాంగకర్త టిఎల్‌ఎన్‌ మూర్తి సంకలనపర్చిన అభినందన నందన మందారాలు అనే పుస్తకాన్ని పార్వతీపురం పట్టణానికి చెందిన జూనియర్‌ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌ భట్లు ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు గంటేడ గౌర్నాయుడుతో కలిసి ఆదివారం పట్టణంలోని శ్రీనివాస కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాహితీ అభిమానులు, కవులు, రచయితలు, రచయిత కృషి గురించి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని ఎవరి పదవీ విరమణ జరిగిన అభినందన పత్రాన్ని తనదైన శైలిలో పద్యాలతో రాయడం మూర్తి విశిష్ట శైలి అని అన్నారు. ఆయన రాసిన అభినందన మందారాలు 100కు పైగా సంకలనపర్చి ఒకే పుస్తకంగా రావడం భావి రచయితలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం టిఎల్‌ఎన్‌ మూర్తి దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన రచయితలు, సాహితీ అభిమానులు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.