నినాదాలు చేస్తున్న టిడిపి నాయకులు
అభద్రతా భావంతోనే అక్రమ కేసులు
-మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపట్ల, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుపట్ల పెరుగుతున్న ప్రజాథరణ చూసి ఓర్వలేక వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. బుధవారం టిడిపి నాయకులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ రూరల్ ఎంఎల్‌ఎ కార్యాలయంలో 'బాబుకు తోడుగా మేము సైతం' అంటూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిభిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడు అరెస్టు సక్రమమైంది కాదని, మాజీ ఐఏఎస్ అధికారి రమేష్ ఇటీవల చేసిన ప్రకటనతో నిర్ధారణ అయిందన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి రమేష్ ఇచ్చిన వాగ్మూలాన్ని ఆధారంగా తీసుకొని కేసు పెట్టామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడేమంటారో చెప్పాలన్నారు. రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్బందాలు, పాశవిక చట్టాలతో పనిలేకుండా ప్రజలందరూ గుసగుసల ఉద్యమం ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని, అతి త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు తో సమాదానం చెబుతారని, రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా నిలుస్తామన్నారు. ఈ శిభిరంలోరాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజా నాయుడు, జెన్ని రమణయ్య, జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మన్నెం పెంచల నాయుడు, జలదంకి సుధాకర్, రాష్ట్ర ఎస్.సి. సెల్ ఉపాధ్యక్షులు శైలేంద్ర బాబు, రూరల్ టిడిపి మండల పార్టీ కన్వీనర్ పముజుల ప్రదీప్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, టి.సుధా రవీంద్ర, కార్పొరేటర్లు భీమినేని మురహరి, చేజర్ల మహేష్, బద్దెపూడి నరసింహ గిరి, క్లస్టర్ ఇంచార్జ్ లు మన్నేపల్లి రఘు, కంటే సాయి బాబా, అల్లాభక్షు, సాబీర్ ఖాన్, సారంగం గున్నయ్య, కనుపర్తి గంగాధర్, నెల్లూరు మురళి, టీడీపీ నాయకులు చెక్క సాయి సునీల్, పురుషోత్తం యాదవ్, ఆరవ శ్రీనివాసులు, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, షంషుద్దీన్, శివాచారి, వడ్లమూడి రమేష్, రూరల్ మహిళా అధ్యక్షురాలు వనజా రెడ్డి, తోట శోభా రాణి, చేజర్ల కవిత, పట్నంఅరుణమ్మ, మాధవి, తనూజ, పద్మ, శాంతి, పద్మజ, నెల్లూరు బుజ్జమ్మ, కరీమా, దేవి, లక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










