
జిల్లా రెవెన్యూ అధికారి కృష్ణవేణి
ప్రజాశక్తి - భీమవరం
విద్యా రంగం అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మ రణీయమని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టట్‌లో భారతదేశ తొలి విద్యా శాఖా మంత్రి, స్వాతంత్ర సమరయోధులు, భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ ఆజాద్ సేవలు నిరుపమానమని తెలిపారు. స్వాతంత్ర సంగ్రామంలో జాతి కోసం ఆయన విశేష కృషి చేశారన్నారు. భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రిగా పనిచేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని వివరించారు. ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డి.మహేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఎఒ ఎం.శ్రీనివాస రావు, సూపరింటెండెంట్ హెచ్‌వి.శేషుమూర్తి, ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకం సభ్యులు పాల్గొన్నారు.