ప్రజాశక్తి-కందుకూరు : కీర్తిశేషులు మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటుకు అనుమతివ్వాలని సోమవారం మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్‌కు వినతిపత్రం అందజేశారు. కందుకూరులో విగ్రహం పతిష్ట ఫర్మిషన్ కోసం కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కందుకూరు మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన వారిలో ఎపిజె అబ్దుల్ కలాం కమిటీ ముఖ్యులు ముజీబ్ , సందానీ బాషా ఉన్నారు.