అబాకస్ పోటీల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులు
హిందూపురం : సిప్ అబాకస్ అకాడమి వారు విజయవాడలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో హిందూపురం విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు సిప్ అబాకస్ నిర్వహకురాలు మాలతి తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 900 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో హిందూపురం నుంచి 57 మంది విద్యార్థులు పాల్గొనగా 45 మంది ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు చెప్పారు.










