ఫిడే ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన రమేశ్‌బాబు ప్రజ్ఞానందపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఫైనల్లో టైబ్రేక్ ఓడిన ప్రజ్ఞానందకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. 'టోర్నమెంట్‌లో అద్భుతంగా ఆడినందుకు అభినందనలు. నీ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండు. దేశం గర్వపడేలా చేశావు' అని పేర్కొన్నాడు.










