Nov 21,2023 07:50

         నిన్న క్రికెట్‌ గెలవాలని దేశంలో కొంతమంది యజ్ఞయాగాలు నిర్వహించారు. చివరికి ఇండియా ఓడి పోయింది. యజ్ఞయాగాల ఫలితం ఏమైంది? ఆలోచించండి. కార్తీక సోమ వారం పేరుతో పురోహితులు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. సముద్ర స్నానాలు, చండీయాగాలు, మహా చండీ యాగాలు అంటూ ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితం..పురోహితులకు భారీ సంభావనలు. ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచం ఎంతో ముందుకి పోతోంది. కానీ మన ఆలోచనలు మాత్రం తాతల కాలంలోనే ఉన్నాయి. మన ఆలోచనలు మారాలి. ఆచారాల పేరుతో, మన సంస్కృతి పేరుతో వెనక్కి పోవటాన్ని ఆపాలి. శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగిస్తూ ముందుకి పోదాం. అదే హేతువాద ఆలోచన. ఈ మధ్య ముఖ్యమంత్రులు కెసిఆర్‌, జగన్‌ యజ్ఞయాగాలు ప్రజాధనంతో చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. స్వతంత్ర పోరాటంలో ఆ రోజు ఎవరూ స్వతంత్రం కోసం గుళ్ల చుట్టూ తిరగలేదు. పట్టుదలతో పోరాటం చేశారు. ఆ స్ఫూర్తి ప్రజలలో రావాలి. చినజియ్యరు, స్వరూపానంద ఇప్పటివరకు ఎన్నో యాగాలు చేశారు. బేతాళ మాంత్రికులు పార్లమెంటు భవనం ప్రారంభ సందర్భంలో పార్లమెంటు భవనంలో పూజలు చేశారు. ఇలాంటి వాటి వలన వారికి భారీగా సంభావనలు ముట్టాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇది పూర్తిగా దేశ లౌకికవాదానికి, వారు ప్రమాణం చేసిన రాజ్యాంగానికి వ్యతిరేకం. కనుక శాస్త్రీయ ఆలోచనని పెంపొందించాల్చిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- నార్నె వెంకట సుబ్బయ్య,
ఎ.పి హేతువాద సంఘం అధ్యక్షుడు.