Nov 01,2023 12:28

అనంతపురం : నిత్యం దుర్బిక్ష ప్రాంతమైన రాయలసీమలో మెట్ట వ్యవసాయంలో రైతులకు మేలు చేయడం కోసం నాలుగు దశాబ్ధాలుగా కృషి చేస్తున్న డాక్టర్‌ యర్రగొండ వెంకట మల్లారెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్‌.ఆర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని విజయవాడలో బుధవారం అందజేసింది.

                                                             సిఎం జగన్‌ చేతులమీదుగా అవార్డు...

రాష్ట్రంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్నవారికి ప్రభుత్వ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో భాగంగా ... 2023 వ సంవత్సరంలో మెట్ట వ్యవసాయ రంగంలో విశేషంగా కృషి చేస్తున్నందుకు మల్లారెడ్డిని పురస్కారంతో ఎపి ఫ్రభుత్వం సత్కరించింది. విజయవాడలో ఎ కన్వెన్షన్‌ హాలులో బుధవారం జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మల్లారెడ్డి అందుకున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం నీరుకుంట్లపల్లి గ్రామంలో వెంకటమ్మ, యర్రగొండ హరినారాయణరెడ్డి దంపతులకు 1954 లో జన్మించిన మల్లారెడ్డి 1974లో ఆర్డిటీ సంస్థలో చేరి విన్సెంట్‌ ఫెర్రర్‌ ద్వారా ప్రేరణ పొంది మెట్ట రైతుల పురోభివఅద్ధికి పాటుపడేందుకు సిద్దమయ్యారు. అతి చిన్న వయసులోనే ఆ సంస్థలో డైరెక్టరుగా నియమితులయ్యారు. ఒకవైపు సంస్థ ద్వారా పేద ప్రజలకు మెరుగైన సేవలను అందించే కార్యక్రమాల్లో పాల్గంటూనే... శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో హ్యుమన్‌ రిపోర్సు డెవలప్మెంట్‌ లో పిహెచ్‌డి, ఇంగ్లండ్‌లో ఎం.బి.ఏ పూర్తి చేశారు. ఫుల్బ్రైట్‌ స్కాలర్‌గా అమెరికాలో వర్షాభావ వ్యవసాయంపై ఆరు నెలలు పాటు పరిశోధనలు చేశారు. 1998లో Accion Fraterna Ecology Centre సంస్థకి డైరెక్టర్‌ గా నియమితులయ్యి దాని ద్వారా వర్షాభావ ప్రాంతాల్లో మెట్ట వ్యవసాయం, ప్రత్యామ్నాయ జీవనోపాధుల కల్పనపై కృషి చేస్తున్నారు. వారు లోతైన అవగాహనతో, సామాజిక స్పృహతో, తన అనుభావాన్ని రంగరించి సామాన్యులకు సైతం అర్ధమైయే రీతిలో ''అనంత ప్రస్థానం'' అనే పుస్తకము రాశారు. దానిలో ఉమ్మడి అనంతపురము జిల్లా సామాజిక, ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అంశములను నిశితంగా స్పష్టంగా వివరిస్తూ జిల్లా సమగ్రాభివఅద్ధికి ఆచరనాత్మకమైన సూచనలు చేశారు.

                                                పేద రైతుల, రైతు కూలీల ఆదాయ భద్రతకు కొత్త ఒరవడి...

అలాగే ఇతర పరిశోధకులతో కలిసి ''Climate-Drought Resilience in Extreme Environments'' అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని కూడా రాశారు. డాక్టర్‌ మల్లారెడ్డి నాయకత్వంలో ఎకాలజీ సెంటరు అమలుపరచిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు సఅజనాత్మకంగా, పేద రైతుల, రైతు కూలీల ఆదాయ భద్రతకు కొత్త ఒరవడి కలిగియుండి, చాలా ప్రభుత్వ విధానాలను గ్రామీణ పేదలకు, నిత్యం కరువులకు గురయ్యే వర్షధార వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి దోహదం చేశాయి.

                                                                         30 సంవత్సరాలుగా కృషి....

అనంతపురము జిల్లాలో '' అనంత జలవలయం'' (Anantha Water Grid) ఏర్పాటు చేయాలని గత 30 సంవత్సరాలుగా డాక్టర్‌ మల్లారెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అనంతపురము జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి చెరువును అనుసంధానం చేసి, నదీ జలాలతో నింపితే ఆ చెరువులు ఆయా గ్రామాలకు బహుళార్ధక ప్రాజెక్టులుగా ఉపయోగపడి వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని, గ్రామీణ జీవనోపాధులని సుస్థిరం చేస్తాయి. హంద్రీనీవా, తుంగభద్ర ప్రాజెక్ట్‌ జలాలతో చెరువులను నింపడం మొదలు కావడంతో తన కల కొంత వరకు సాకారం అయిందని మల్లారెడ్డి భావిస్తున్నారు.

                                                                       అనేక అవార్డులు-పురస్కారాలు

నాలుగు దశాబ్ధాలుగా మల్లారెడ్డి చేస్తున్న సేవలకుగాను ఆయన అనేక అంతర్జాతీయ అవార్డులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యులుగా ఉన్నారు. అంతక మునుపు 2004లో రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జయతీ ఘోష్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

                                                     మల్లారెడ్డి అందుకున్న కొన్ని అవార్డులు...

1.కేంద్ర జలవనరుల విభాగం నుంచి ఉత్తమ ఎన్జీవో బహుమతి
2.ఎఫ్‌ఐసిసిఐ నుంచి జాతీయ స్థాయి సుస్థిర వ్యవసాయం అవార్డు
3.మహీంద్ర అండ్‌ మహీంద్ర నుంచి కృషి సహయోగ్‌ సమ్మాన్‌ అవార్డు
4.రైతు నేస్తం ఫౌండేషన్‌ నుంచి రైతు నేస్టం అవార్డు
5.శ్రీమతి దుర్గాబారు దేశ్‌ముఖ్‌ అవార్డు
6.ఎన్జీరంగ కిసాన్‌ సేవా సమితి నుంచి జీవన సాఫల్య పురష్కారం.
7.రాష్ట్ర ప్రభుత్వం నుంచి జలమిత్ర అవార్డు
8.రాష్ట్ర ప్రభుత్వం నుంచే బయోడ్కెవర్శిటీ కన్జర్వర్‌ అవార్డు
9.అనంత ఆణిముత్యాలు అవార్డు