
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ... స్ఠానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కశింకోట లో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతి రావు మాట్లాడుతూ ... అందరూ ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేశారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. మాస్క్ వాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌పిహెచ్‌ఓహొసిహెచ్.సత్య నారాయణ, మురళీకృష్ణ, రామూర్తి, సత్యవతి, మున్ని, విజయలక్ష్మి, సుభాని, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.