
దుంగార్‌పూర్ : దుంగార్‌పూర్ సిపిఎం అభ్యర్థి గోతమ్ దామోర్‌కు మద్దతుగా బిచ్చివాడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను పరిరక్షించుకునేందుకు, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బాపురామ్ బరందా అధ్యక్షతన జరిగిన సభలో దులీచంద్‌మీనా తదితరులు ప్రసంగించారు.