భువనేశ్వర్ : పాము కాటుతో సంభవిస్తున్న మరణాలపై, వాటిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలపై సవివరమైన నివేదికను అందజేయాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) కేంద్ర, ఒడిషా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏటా 58 వేలకు పైగా పాము కాటు మరణాలు నమోదవుతున్నాయని పేర్కొంటూ మానవ హక్కుల లాయర్ రాధాకాంత్ త్రిపాఠి ఎన్‌హెచ్‌ఆర్‌సి దృష్టికి తీసుకొచ్చారు. ఒడిషాలో అన్ని విపత్తుల మరణాల్లో పాము కాటు మరణాలు 40 శాతానికి పైగా వున్నాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాము విషానికి విరుగుడు మందులు వుండకపోవడమే ప్రధాన కారణమన్నారు. డిసెంబరు 16 కల్లా కమిషన్‌కు నివేదిక అందాలని అధికారులను కమిషన్ ఆదేశించింది.










