
అల్లరి చిల్లరి పిల్లలం
కల్లలు పలకని బుడుగులం
బుద్ధిగ చదువులు చదివేస్తాం
సుద్దులు ఎన్నో నేర్చేస్తాం
గురువుకు దండం పెట్టేస్తాం
తరువును చక్కగ రక్షిస్తాం
కులమత భేదం వదిలేస్తాం
కలతలు లేకనె మెలిగేస్తాం
ప్రకృతి మాతను మెప్పిస్తాం
సుకృత పథమున నడిచేస్తాం
ఉన్నత విద్యను చదివేస్తాం
మిన్నగ బతుకును మార్చేస్తాం
అవరోధాలను ఎదిరించేస్తాం
నవలోకానికి పునాదులేస్తాం
భారతమాతకు హారతులిస్తాం
భారతావనిని ముద్దాడేస్తాం..
- మీసాల చినగౌరినాయుడు,
బొబ్బిలి, 94928 48564.