Oct 18,2023 10:04

కొమ్మల్లో కోయిల పాట
బెక బెకమని బాతుల బాట
జుమ్మనే తేనెటీగల మూట

గాండ్రించే పులుల వేట
రాగాల రామచిలుకల మాట
తూగే తుమ్మెదల తోట

కోనల్లో కోతుల ఆట
మా నివాసం అడవంట
మేమంతా ఒకటేనంట !

- బోనగిరి పాండురంగ