కరీంనగర్ : బిఆర్‌ఎస్ నేతలకు హెచ్చరికలిస్తూ ... సిద్ధిపేటలో మావోయిస్టు పార్టీ పేరుతో ప్రదర్శించిన పోస్టర్లు అధికారుల్లో కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక-దుంపలపల్లి మధ్య ఉన్న పిల్లర్‌కు సిపిఐ మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లను అతికించారు. ఈ పోస్టర్ల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిఆర్‌ఎస్ నాయకులకి హెచ్చరికలు జారీ చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు ఇసుక మాఫీయా, భూ కబ్జాలు చేస్తున్నారని.. ప్రశ్నించినవారిపైన దాడులు చేసి హత్యలు చేస్తున్నారని.. ప్రజల పై బిఆర్‌ఎస్ నాయకులు పెత్తనం చెలయిస్తున్నారని. ఇదే కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. ఈ అక్రమాలను తక్షణమే ఆపేయాలని.. లేకపోతే ప్రజల ముందు శిక్షలు తప్పవు అంటూ మావోయిస్టులు పోస్టర్ల ద్వారా బిఆర్‌ఎస్ నాయకులకు హెచ్చరికలు జారీచేశారు. అయితే ఈ పోస్టర్లు ఎవరు అంటించారు అనేది ప్రశ్నగా మిగిలింది.










