ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరగబోయే 2వ బిర్సా ముండా ఓపెన్ నేషనల్ టైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలకు విజయనగరం జిల్లా నుండి 16 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. జాతీయ పోటీలకు ఎంపికయిన క్రీడాకారులకు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గురానఅయ్యలు, సిహెచ్.వేణుగోపాలరావు అభినందనలు తెలుపుతూ క్రీడాకారులంతా విజయంతో తిరిగి రావాలని కోరారు. .










