Aug 10,2023 09:51

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : వైజాగ్‌ నేవీ మారథాస్‌ 05 నవంబర్‌ 2023 న నిర్వహిస్తున్నామని వైజాగ్‌ నేవీ మారథాస్‌ రేస్‌ డైరెక్టర్‌ వెంకట రామన్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం డాల్ఫిన్‌ హౌటెల్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట రామన్‌ మాట్లాడుతూ .... వైజాగ్‌ నేవీ మారథాస్‌ 8వ ఎడిషన్‌ కు సంబంధించిన వివరాలను తెలిపారు. విశాఖ నగరం రన్నింగ్‌, క్రీడా ప్రపంచం దిశగా దూసుకువెళ్ళాలనే లక్ష్యంతో ఈ మారథస్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2014 నుండి ఈ మారథాన్‌ ను నిర్వహిస్తున్నామని 8వ ఎడిషన్‌ వైజాగ్‌ నేవీ మారథాస్‌ ఎంతో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాకలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో పాల్గొనాలి అనుకునే వారు ఙఱఓaస్త్రఅaఙyఎaతీa్‌ష్ట్రశీఅ.తీబఅ లో రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. వైజాగ్‌ నేవీ మారథాస్‌ లో పాల్గొనే వారి సంఖ్య క్రమేణ పెరుగుతూ వస్తున్నది. మొదటి ఎడిషన్‌ లో 1800 నుండి ఆరంభమైన మారథాన్‌ 2022 గత ఎడిషన్‌ 18000 పాల్గన్నారని ఈ ఏడాది మారథాన్‌ కార్యక్రమం నాలుగు రన్స్‌ క్యాటగిరులలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మారథాన్‌ రస్‌ బీచ్‌ రోడ్డులోని విశ్వ ప్రియ ఫంక్షన్‌ హాల్‌ నుండి ప్రారంభమై అందమైన బీచ్‌ రోడ్డు వెంబడి మొదటి కేటగిరి లో పూర్తి మారథాన్‌ (42.19 కి.మీ) ఉదయం 4:15 గంటలకు ప్రారంభం అయి ఐఎన్‌ఎస్‌ కళింగా వరకు , రెండవ కేటగిరి లో సగం మారథాన్‌ (21.1 కి.మీ) 05:15 గంటలకు ప్రారంభం అయి గీతం కాలేజీ మలుపు వరకు, మూడవ కేటగిరి లో (10 కి.మీ) 06:15 గంటలకు ప్రారంభం అయి తెన్నేటి పార్క్‌ వరకు , నాలుగవ కేటగిరి లో (5 కి.మీ) కరక చెట్టు రోడ్‌ వరకు సాగుతుందని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమం లో వైజాగ్‌ నేవీ మారథాస్‌ వెబ్‌ సైట్‌ ను రిజిస్ట్రేషన్‌ లను ప్రాంభించారు. ఐఎస్‌ఎస్‌ కళింగ కమాండింగ్‌ ఆఫీసర్‌ సీఎస్‌ నాయర్‌ మాట్లాడుతూ ... వైజాగ్‌ నేవీ మారథాస్‌ లో 40 శాతం మంది ఇండియన్‌ నేవీ నుండి 60 శాతం మంది ప్రజలు పాల్గంటారని , పేర్లు నమోదు చేసుకోవడానికి చివరి తేది 15 అక్టోబర్‌ 2023 గా నిర్ణయించామని తెలిపారు. ఈ ఏడాది 18000ల మందికి పైగా నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ మారథాస్‌ 18-35 ఏళ్ళ 35-55 ఏళ్ళ వారిని రెండు విభాగాలలో మహిళలు, పురుషులు రెండు కేటగిరీలుగా సాగుతుందని తెలిపారు. కేర్‌ హాస్పిటల్‌ సిఈఓ వి.శ్రీనివాస్‌, నేవీ డిఫెన్స్‌ పిఆర్‌ఓ కెప్టెన్‌ సి.జి.రాజు, ఐఎన్‌ఎస్‌ కళింగా సిఈఓ కెప్టెన్‌ ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.