
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అక్టోబర్ నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం సికందర్ రాజా(జింబాబ్వే), డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా) పేర్లను కూడా ఐసిసి పరిశీలించగా.. టైటిల్‌ను మాత్రం విరాట్ కోహ్లీ ఎగురేసుకుపోయాడు. అక్టోబర్ నెలలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో కోహ్లి కేవలం నాలుగు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి మూడు మ్యాచుల్లో అజేయంగా నిలిచాడు. పాకిస్తాన్‌పై 82(నాటౌట్) ఇన్నింగ్స్ అసాధారణమైందని ఐసిసి తెలిపింది. ఆ మ్యాచ్‌లో దాదాపు ఓటమి అంచులో ఉన్న ఇండియాను కోహ్లీ తన అద్భుత ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడని, టి20ల్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని కూడా కోహ్లీ తెలిపాడని, దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' కోసం జరిగిన ఓటింగ్‌లో కోహ్లి పేరును చేర్చామని ఐసిసి పేర్కొంది.
Congratulations to @imVkohli - ICC Player of the Month for October 👏👏#TeamIndia pic.twitter.com/IEnlciVt9T
— BCCI (@BCCI) November 7, 2022