కాకినాడ : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి సంగ్రామం సైకిల్ యాత్రను తునిలో శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ యాత్రను ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎస్‌కె.సాబ్జీ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎల్‌జె.నాయుడు ప్రారంభించారు.










