Oct 24,2023 11:02

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఈనెల 26 నుండి నవంబర్‌ 9 వరకు గోవాలో జరగబోయే 37 వ జాతీయ క్రీడలకు విజయనగరం జిల్లాకు చెందిన జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సిహెచ్‌ వేణుగోపాలరావుని డిప్యూటీ చీఫ్‌ డిమిషన్‌ గా ఆంధ్రప్రదేశ్‌ ఒలంపిక్‌ అసోసియేషన్‌ నియమించింది. ఈ పదవిని మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లా నుండి ఎంపిక చేసినందుకు జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గురాన అయ్యలు , క్రీడా సంఘాల ప్రతినిధులు వేణుగోపాల్‌ రావు కి అభినందనలు తెలిపారు.