ప్రజాశక్తి నందలూరు : పశువులలో వచ్చే లంపీ స్కిన్ వ్యాధికి టీకాలే సరైన వైద్యం అని పశుసంవర్తక శాఖ ఉప సంచాలకులు, డాక్టర్. కె. ప్రతాప్ అన్నారు. శుక్రవారం ఆడపూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఈదర పల్లె గ్రామంలో మండల వెటర్నరీ డాక్టర్ స్నిగ్ధ ప్రణీత ఆధ్వర్యంలో రైతులకు పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏడి. డాక్టర్. కె. ప్రతాప్ మాట్లాడుతూ పశువులను పెంచే రైతులు పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలవుతుందన్నారు. వ్యాధులు రాకుండా ఏ యే సమయాలలో ఏ యె టీకాలు వేయించుకోవాలో రైతులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం పశువులకు సంబంధించిన మందులను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు రెడ్డి ప్రసాద్. గోపాలమిత్ర శివరాం, రైతులు పాల్గొన్నారు.










