Jul 07,2023 17:04

జెనీవా : ఇటీవల పాలస్తీనాలోని జెనిన్‌ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడిలో డజన్ల సంఖ్యలో పాలస్తీనా పౌరులు మృతి చెందారు. వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం దాని బాధ్యతలను పాటించాలని నేను ఇజ్రాయెల్‌ను మరోసారి కోరుతున్నానని గుటెరస్‌ పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం.. దామాషా బలాన్ని ఉపయోగించడం వంటి నియమం మాత్రమే కాకుండా.. సంయమనం పాటించడం.. నష్టాన్ని తగ్గించడం, మానవ జీవితాన్ని గౌరవించడం, సంరక్షించడం వంటి బాధ్యతలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ చట్టంలోని బాధ్యతలను ఇజ్రాయెల్‌ విధిగా పాటించాలని, గడిచిన దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే.. అభద్రతతోపాటు తీవ్రవాదం పెరుగుతున్నదని ఆయన అన్నారు.