
పిడుగురాళ్ల (పల్నాడు) : పల్నాడులో సోమవారం ఉదయం రెండు ప్రమాదాలు జరిగాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని అయ్యప్ప స్వామి దేవాలయం పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా... మరోవైపు ... పల్నాడు జిల్లా వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద ఎదురెదురుగా వాహనాలు ఢకొీట్టుకోవడంతో బల్లాపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవ్యక్తికి తీవ్రగాయాలవ్వడంతో స్థానికులు 108 కి సమాచారమిచ్చారు. క్షతగాత్రుడిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.