
జెనీవా : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్‌లోని అత్యున్నతస్థాయి 78వ సెషన్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. మంగళవారం జరిగిన సెషన్‌లో ఎర్డోగాన్ ప్రసంగిస్తూ.. 'భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య చర్చలు, సహకారం ద్వారానే కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడం సాధ్యమవుతుంది. శాంతి చర్చలకు టర్కీ మద్దతునిస్తుంది.' అని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని ఎర్డోగాన్ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఐదుగురు శాశ్వత సభ్యులతోపాటు 15 మంది తాత్కాలిక సభ్యులను కూడా శాశ్వత సభ్యులను చేయడానికి తాను మొగ్గుచూపుతున్నట్లు ఆయన చెప్పారు.