
వాషింగ్టన్ : చాట్‌జీపీటీకి పోటీగా త్వరలో ట్రూత్‌జీపీటీని ప్రారంభించనున్నట్లు బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ప్రపంచ స్వభావాన్ని అర్థం చేసుకునేలా ఇది ఉంటుందని అన్నారు.
ప్రజెంట్ టెక్ రంగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ఏఐతో మానవాళికి ముప్పు ఉందని ఇప్పటికే పలువురు టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నారు. చాట్ జీపీటీ తరహా చాట్‌బాట్‌లు పక్షపాతంగా వ్యవహరించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్ ఏఐ ఆధారిత చాట్‌బాట్ ట్రూత్ జీపీటీని తీసుకురానున్నట్లు తెలిపారు.
చాట్‌జీపీటీ వల్ల ప్రమాదం..: మస్క్
కఅత్రిమ మేధతో మానవాళికి ముప్పు పొంచి ఉందని బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి హెచ్చరించారు. చాట్‌జీపీటీ తరహా చాట్‌బాట్‌లు పక్షపాతంగా వ్యహరించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తాను కూడా కఅత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మొత్తం మానవాళినే నాశనం చేసే శక్తి ఏఐకి ఉంది : ఎలాన్ మస్క్
ట్రూత్‌జీపీటీ పేరిట తాను తీసుకురాబోయే ఏఐ చాట్‌బాట్.. ప్రకఅతితత్వాన్ని అర్థం చేసుకుని వ్యవహరిస్తుందని ఎలాన్ మస్క్ తెలిపారు. ఇలా మనవాళిని అర్థం చేసుకునే ఏఐ వల్ల ఎలాంటి ముప్పు ఉండదని అన్నారు. చాట్‌జీపీటీకి సరైన పద్ధతిలో శిక్షణనివ్వడం లేదని.. తద్వారా అది పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపించారు. ఓపెన్‌ఏఐ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు అనుబంధంగా పనిచేస్తోందన్నారు. ఇక ఆ కంపెనీ ఏమాత్రం లాభాపేక్షలేని సంస్థ కాదని చెప్పారు. ఏఐని కచ్చితంగా నియంత్రించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. మొత్తం మానవాళినే నాశనం చేసే శక్తి ఏఐకి ఉందని ఎలాన్ మస్క్ హెచ్చరించారు.
టెక్ దిగ్గజాలతో పోలిస్తే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ఎలాన్ మస్క్..!
ఏఐ సాంకేతికత అభివృద్ధి కోసం మస్క్ ఎక్స్.ఏఐ కార్ప్ పేరిట ఓ సంస్థను సైతం రిజిస్ట్రేషన్ చేసినట్లు నెవాడా బిజినెస్ ఫైలింగ్ ద్వారా సమాచారం. దీనికి మస్క్ డైరెక్టర్‌గా, ఆయన సలహాదారు జేర్డ్ బిర్చల్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. ఏఐపై మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ వంటి టెక్ దిగ్గజాలతో పోలిస్తే మస్క్ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐలో తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసినవాళ్లలో మస్క్ కూడా ఒకరు. 2018లో దాని నుంచి ఆయన పూర్తిగా నిష్క్రమించారు. కంపెనీని నడిపిస్తున్న వారితో విభేదాలు, టెస్లాలో కొన్ని కీలక పనులపై దఅష్టి సారించాల్సిన అవసరం ఉండడం వల్లే తాను ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించారు.