Nov 14,2023 13:22

వాషింగ్టన్‌ (అమెరికా) : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోదరి మేరియన్‌ ట్రంప్‌బారీ (86) సోమవారం కన్నుమూశారు. న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న మేరియన్‌ నిన్న తెల్లవారుజామున మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడ్డాయి. ట్రంప్‌కు ఉన్న నలుగురు తోబుట్టువుల్లో మేరియన్‌ మూడో వ్యక్తి. ఆమె న్యూజెర్సీలో ఫెడరల్‌ న్యాయమూర్తిగా పని చేసి 2019లో పదవీ విరమణ పొందారు. గతేడాది ట్రంప్‌ సోదరుడు రాబర్ట్‌ ట్రంప్‌ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.