Oct 10,2023 09:41

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్‌ సుందర్‌ రెడ్డి (86) సోమవారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని దిల్‌ రాజు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. శ్యామ్‌ సుందర్‌ రెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దిల్‌ రాజును పరామర్శిస్తున్నారు. శ్యామ్‌ సుందర్‌ రెడ్డి స్వస్థలం నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌ పల్లి గ్రామం. ఈయనకు దిల్‌ రాజుతో పాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్యామ్‌ సుందర్‌ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్‌ ఎమ్మెల్యే ఎంపీ కాలనీలోని దిల్‌ రాజు ఇంటికి మంగళవారం తెల్లవారుజామున 6.30 గంటలకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో శ్యామ్‌ సుందర్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.