
ప్రజాశక్తి- మండపేట:మండలంలోని అర్తమూరు గ్రామంలో ఆర్.డి.ఎస్.ఎస్ నిధులు రూ.20 లక్షల రూపాయలతో జరుగుతున్న త్రీఫేస్ విద్యుత్ పనులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వంలో అనేకసార్లు విన్నవించుకున్న త్రీఫేస్ ఇవ్వలేదన్నారు. గ్రామంలోని విద్యుత్ అవసరతను గుర్తించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు త్రీఫేస్ విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టడం ఆనందాయకంగా ఉందన్నారు. ఈయన వెంట వైసీపీ నాయకులు కురుపూడి రాంబాబు, పలివెల సుధాకర్ తదితరులు ఉన్నారు.