కొలంబో : గత రెండు వారాల నుండి శ్రీలంకలోని దాదాపు అన్ని జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ప్రారంభించిన అశ్వసుమ సంక్షేమ కార్యక్రమం నుండి వేలాదిమంది ప్రజలను విక్రమసింఘె ప్రభుత్వం మినహాయించడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తునాురు. ఈ పథకం నుండి మినహాయించబడిన నిరుపేదలు ప్రాంతీయ పాలనా విభాగాలైన డివిజనల్ సెక్రటేరియట్‌ల వెలుపల గూమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు కూడా ఈ సాయం అందాలనికోరారు. ఇప్పటికే అమల్లో వును సమృద్ధి కార్యక్రమం స్థానే మే మాసంలో అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘె అశ్వసుమను తీసుకువచ్చారు. బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలంటే ప్రభుత్వం ముందుగా సంక్షేమం, ఇతర సామాజిక వ్యయంలో కోతలు విధించాల్సిందేనని ఐఎంఎఫ్ ప్రభుత్వానిు డిమాండ్ చేసింది. సంక్షేమ కార్యక్రమం కేవలం సమాజంలో అత్యంత బడుగు వర్గాలకేనని ఐఎంఎఫ్ ప్రకటించింది. నిరసన చేస్తును వారిలో చాలామంది గతంలో సమృద్ధి అందుకునిఇప్పుడు అశ్వసుమకు మినహాయించబడిన వారిలో వునాురు. కొత్త కార్యక్రమానికి పెట్టుకును తమ దరఖాస్తులను ఆమోదించలేదని చెప్పారు. తాజా చర్యలతో తాను నెలవారీ అందుకునే 2500 సబ్సిడీ మొత్తానిు అందుకోలేనని, దానివల్ల తన కుటుంబానికి చాలా ఇబ్బందులు ఏర్పడతాయని అశోక్ హెరాత్ అనే వ్యక్తి విమర్శించారు. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకును ప్రభుత్వం దీనిపై అప్పీల్ చేసుకోవడానికి జు 10వరకు గడువు ఇచ్చింది. మంగళవారాని కల్లా 5.5లక్షల మంది ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. దీంతో దేశంలో దుర్భర దారిద్య్రం ఎంతలా నెలకొందో అర్ధమవుతోంది.










