Sep 18,2023 07:09

సొంత సంపద పెంచుమన్నా
మంచిగా జనాలతో మాట్లాడమన్నా
శుష్క వాగ్దానాలు చెప్పవోయ్
శూన్య ఆచరణ చెప్పబోకోయ్
కొంగ మాటలు చెప్పి,
ఓట్లు పొర్లే దారిలో నువ్వు అడుగు వేయవలెనోయ్
దండిగా దోచిపెడితే
అగ్ర సింహాసనం నీదేనోయ్
దారిద్య దిగువున మనుషులుంటేనే
ఏలికల జాతి బాగుపడునోయ్ ?
సర్దుకొని సంపదలెల్ల దోచుకుని
పరదేశాలకు తరలింపవోయ్

అన్ని దేశాల్లో మన సొమ్మే కుమ్మవలనోయి
విదేశీ సరుకులు ఇచ్చట తెగ నమ్మవలనోయి
డబ్బు దోచిపెట్టె నాయకుల చెంతకే
పదవి, ప్రతిఫలాలు చేరునోయ్

వెనుక చేసిన ఘనము లేదోయ్
వ్యక్తిగతము కొంచమేనోయ్
మందు తాగి నువ్వు చిందులెయ్యవోయ్
వినాయకుల వెనుక బలమ దేనోయ్

జనాభిమానము నాకు కద్దని
ఒట్టి గొప్పలే చెప్పవలనోయి
పూని ఏదైనా సొంతమేల్‌
చూసుకొను వాడే ఘనుడోయ్
స్వలాభమే నంతా చూసుకొని
పొరుగు వాడికి హామీలివ్వవలెనోయ్
దేశమంటే ప్రగతి కాదోయ్
దేశమంతా మా మనుషులే యేలవలెనోయ్

మతములెన్నివున్నా నేమినోయ్
స్వమతస్తులే అధికారము నందు నుండవలెనోయ్,
స్వజాతి నన్నది పెరిగి
లోకమంతా వెలగవలనోయ్ !
 

- డాక్టర్‌ జివిఎస్‌ జయపాలరావు
94920 20115