Oct 17,2023 16:24

ప్రజాశక్తి-నందిగామ(ఎన్‌టిఆర్‌) : నందిగామ పాత కరెంట్‌ ఆఫీస్‌ రోడ్‌లోని చలమాల వెంకటేశ్వర నిలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటికి వెనుకవైపు ఉన్నటువంటి తలుపును పగలగొట్టి బీరువాలని అరకేజీ బంగారం, 32 కేజీల వెండి ఆభరణాలు, 24 ఇంచెస్‌ టీవీ, మైక్రో ఓవెన్‌, నగదును దొచుకెళ్లారు. తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన ప్రదేశాన్ని నందిగామ ఎసిపి జనార్ధన్‌ నాయుడు, సిఐ హనీష్‌ పరిశీలించారు. క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.